Pages

Tuesday, March 8, 2011

FATHER OF INDIAN NAVY







Chatrapati Shivaji was the great emperor of the modern india. He has maintained a great Naval Army in his time. His strategy was to build a strong navy to protect and bolster his kingdom, he was also concerned about the growing dominance of foreign British India naval forces in Indian waters and actively sought to resist it. For this very reason he is also referred to as the “Father of Indian Navy”.






Shivaji was the greatest Hindu king that India had produced within the last thousand years; one who was the very incarnation of lord Siva, about whom prophecies were given out long before he was born; and his advent was eagerly expected by all the great souls and saints of Maharashtra as the deliverer of the Hindus from the hands of the Mlecchas, and as one who succeeded in the reestablishment of Dharma which had been trampled under foot by the depredations of the devastating hordes of the Moghals.

—Swami Vivekananda

Saturday, February 19, 2011

Your War Criminal


భారత యుద్ధ ఖైదీ - నేతాజీ బోస్



భారత స్వాతంత్ర్యానంతరం పశ్చిమ బెంగాల్ కు బి.పి.చక్రవర్తి గవర్నర్ గా వున్నపుడు 3 రోజుల పర్యటన నిమిత్తం లార్డ్ అట్లీ భారత్ సందర్శించాడు. రాజ్ భవన్ లో విడిది చేసినపుడు బి.పి.చక్రవర్తి సమావేశమై తనకున్న కొన్ని సందేహాల్ని వెలిబుచ్చాడు. భారత్ కు స్వాతంత్ర్యం యివ్వటానికి గల అసలు కారణాలు ఏమిటని.
మరీ ముఖ్యంగా 1947 కంటే యెన్నో యేళ్ల ముందే భారత ప్రజలు గొప్ప ఉద్యమాల్ని లేవదీసినా మీరు 1947 ప్రాంతంలోనే హడావిడిగా దేశం వదిలి వెళ్లిపోయారెందుకని?


అట్లీ వివరించాడు.'అన్నిటికంటే ముఖ్యంగా బోస్ నేతృత్వంలో INA ఫోర్స్ కార్యకలాపాల్ల వల్ల బ్రిటిష్ తో భారత భూ, నావికాదళ సైన్యాల సంబంధాలు రోజు రోజుకీ క్షీణమయ్యాయి..' అంటో

'
అది సరే, మరి మీ ప్రభుత్వం పై గాంధీజీ చూపించిన ప్రభావం ఎంత .?'

అపుడు అట్లీ నెమ్మదిగా నవ్వుతో ...ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతో

'
గాంధీయా !?... లే...... మాత్రమే ' ( MI...--NI..--MAL ) '

*

గాంధీజీ ప్రభావం బ్రిటిష్ వాళ్ల మీద ఎంత వుందో తెలీదు కానీ నిస్సందేహంగా బోస్ గొప్ప దేశభక్తుడు. తన అసమాన ప్రతిభాపాటవాల్తో దేశం వొదిలి ప్రపంచ నేతలతో సమాలోచనలు, సమావేశాలు నెరపి వేల మందితో భరతమాతను దాస్య శృంఖలాలనుంచి విడిపించటానికి జర్మనీలో నాలుగు వేలమందితో, తూర్పు ఆసియా ప్రాంతంలో ముప్పై వేలమందితో భారత విప్లవ సైన్యాన్ని తయారు చేశాడు. అదే క్రమంలో INA రంగూన్, ఇంఫాల్, అండమాన్ మరియు నికోబార్ (షహీద్ మరియు స్వరాజ్ పేర్లతో పిలవబడ్డాయి ) బ్రిటిష్ కబంధ హస్తాల్లోంచి విడిపించగలిగింది.

ఎప్పుడు వైపు నుంచి దాడి చేస్తాడో తెలియకుండా కంటికి కునుకు లేకుండా గుబులు పుట్టిస్తూ బ్రిటిష్ వాళ్ల గుండెల్లో నిద్రపోయాడు. భారత భూ, నావికా దళ సైన్యాలు తమపైకే గురిపెట్టి ఎప్పుడు క్షణంలో తిరుగుబాటు చేస్తాయో తెలియని అయోమయ పరిస్థితి. ఆఖరి క్షణాల్లో(?) తన ముఖ్య అనుచరుడితో బోస్ చెప్పిన మాటలు బోస్ ఎంతటి దేశభక్తుడో, భారత ప్రజలకు స్వాతంత్ర్య సమర స్ఫూర్తినిచ్చి తమ శక్తేమిటో తెలియజేస్తాయి.

'
నా దేశ ప్రజలకి నా సందేశాన్ని వినిపించండి. నేనింక కోలుకోలేనేమో. నా ఆఖరి శ్వాస వరకు నా దేశ విముక్తి కోసం పోరాడాను. ప్రజల్ని వెనుకంజ వేయొద్దని,స్వరాజ్యం అతి త్వరలో వస్తుందని చెప్పండి... జైహింద్.'

యింతటి దేశభక్తుడు, కోట్లమందికి ఆరాధ్యుడు , అయిన బోస్ లాంటి జాతి రత్నాన్ని భారత ప్రభుత్వం ఎలా గుర్తుపెట్టుకుందో చూడండి.

ఒకసారి డిల్లీ వాస్తవ్యుడు దేవ్ ఆషిష్ భట్టాచార్య సమాచార హక్కు చట్టం కింద భారత స్వాతంత్ర్య సమరానికి నేతాజీ ఎటువంటి చేయూత నందించాడన్న సమాచారం కోసం అర్జీ పెట్టుకున్నాడు.
దీనికి సదరు సీనియరు ప్రభుత్వాధికారి నుంచి వచ్చిన సమాధానంతో యావద్భారతం అవాక్కై విస్తుబోయింది.

'
భారత స్వాతంత్ర్య సమరానికి సుభాష్ తన వంతు తోడ్పాటు అందించాడనటానికి మా దగ్గిర ఏటువంటి రికార్డూ లేదు ' .

యీ సమాధానం యిచ్చింది ఒక భారతీయుడేనా?
ఆషిష్ కొన్ని ప్రశ్నల అర్జీతో Home ministryని కలిశాడు . భారత స్వాతంత్ర్య సమరంలో బోస్ పాత్ర ఎటువంటిది?. అలాగే భారత ప్రభుత్వం బోస్ కు సంబంధించి ఎటువంటి ప్రొటోకాల్ ని పాటిస్తోంది? అసలు అలాంటిదేదైనా వుందా? జనవరి 23 బోస్ జయంతిని పునస్కరించుకుని నేతాజీ స్ఫూర్తిని వ్యాప్తి చెయ్యడానికి ఎంత ఖర్చు చేసింది?. ఒకవేళ నేతాజీని , అతని పాత్రని విస్మరించాలనుకుంటే దీనికి గల బలమైన కారణాలు ఏమిటి?

దీనికి భారత ప్రభుత్వం వారి సమాధానం.
'
దీనికి సంబంధించిన సమాచారం మా రికార్డుల్లో లేదు '.
ఇదీ Home Minsitry లో డిఫ్యూటీ సెక్రటరీ ఎస్. కె . మల్ హోత్రా సమాధానం. Home Ministry దగ్గిర వీటికి సమాధానమూ లేదు. ఎందుకంటే భారత ప్రభుత్వం దగ్గిర రికార్డూ లేదట. (బహుశా భారత ప్రభుత్వం దగ్గిర తప్ప యూరప్ లో , ఆసియా లో యే దేశంలోనైనా సుభాష్ కి సంబంధించిన రికార్డులెన్నో పుష్కలంగా దొరుకుతాయి. )

తరువాతేం జరిగింది? భారత ప్రభుత్వం తన తప్పు తెలుసుకుందా? లేక ఉదాసీనంగా వ్యవహరించిందా?



యేం చేస్తాం? మన దౌర్భాగ్యం. అమర వీరుల చరిత్రలెన్నిటినో సమాధి చేసుకున్న ఘనత మనది. నెహ్రూ అంతటివాడే తప్పించుకోలేకపోయాడీ దౌర్భల్యం నుంచి.

బ్రిటిష్ ప్రధానమంత్రికి టపా రాస్తూ నెహ్రూ, బోస్ ని 'Your WAR CRIMINAL' అని సంబోధించినపుడే మన ప్రతిష్ట మట్టి పాలయ్యింది.


(
ప్రియమైన క్లిమెంట్ అట్లీ గారికి!

మాకున్న విశ్వసనీయవర్గాల ప్రకారం మీ యుద్దఖైదీ సుభాష్ చంద్రబోస్ ని స్టాలిన్ తమ దేశంలోకి అనుమతించాడని తెలిసింది. ఇది అచ్చంగా విశ్వాసఘాతుకమైన చర్య. బ్రిటిష్-అమెరికాకు రష్యా మిత్ర దేశంగా వుంది. దీని గురించి మీరు ఆలోచించి మీకేది సరైనది అనిపిస్తే అది చేయండి.
ఇట్లు
మీ విధేయుడు
జవహర్ లాల్ నెహ్రూ

1945
డిసెంబర్ శ్యాంలాల్ జైన్ తో ఉత్తరాన్ని టైపు చేయించి పంపించాడు.)

యే దేశ విముక్తి కోసమైతే ప్రాణాలొడ్డి, దేశాలు తిరిగి, సముద్రాలు , పర్వతాలూ దాటి మహా సైన్యాన్ని నడిపించినవాడో, తన మాతృదేశ విముక్తి కోసం రక్త తర్పణం చేసిన వీరుడినా 'WAR CRIMINAL' అని నెహ్రూ లాంటి ఉన్నత విద్యావంతుడు, గొప్ప దేశభక్తుడు అన్నది. తన మాతృదేశం కోసం ఆత్మ త్యాగం చేసినవాడు దేశానికే యుద్దఖైదీ అయ్యాడు . యింతటి దుస్థితి యే దేశానికి, యే దేశ పౌరులకీ రాకూడదు. మరెందుకిలా జరిగింది??????



ఆశ్చర్యకరమైన విషయమేంటంటే 1945 Aug 18 ఫ్లైట్ ఆక్సిడెంట్ లో సుభాష్ మృతి చెందినట్టుగా అప్పటికే అధికారిక సమాచారముంది. అది జగమెరిగిన సత్యం(?).
మరి విషయం లో నెహ్రూ అంత హుటాహుటిన అట్లీకి (1945 Dec) ఉత్తరం రాయటంలో మతలబు ఏమైవుంటుంది?

ఇది మిలియన్ డాలర్ ప్రశ్న.





This is what we had in the 60 Years of INDEPENDENCE.